కల్వకుంట్ల కుటుంబం తీపి మాటలు చెప్పి గొంతులు కోస్తారు – కిషన్ రెడ్డి

-

కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబం తీపి మాటలు చెప్పి గొంతులు కోస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనలు చూసి ఏం చెప్పబోతున్నాడు అని అందరం ఎదురు చూశామని.. అప్పుడు ఆయన మాట్లాడుతూ రైతులు వద్దని చెప్పే వరకు ఉచితంగా ఎరువులు ఇస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారని గుర్తు చేశారు. దేవుడు నన్ను అందుకే పుట్టించాడు అన్నావు కదా కెసిఆర్.. మరి రైతులకు ఉచితంగా ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫామ్ హౌస్ లో కూర్చున్న వారికి తెలియాలన్నారు. బంగారు తెలంగాణలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కౌలు రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. అబద్ధాలు చెప్పేందుకే కేసీఆర్ పుట్టారని దుయ్యబట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పాలన చేస్తున్నారని.. బిజెపి అధికారంలోకి వస్తే ప్రజా ప్రగతి భవన్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news