కొత్తగూడెం..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక స్థానం. మొదట నుంచి ఈ స్థానం పెద్ద హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై వేటు పడటం సంచలనంగా మారింది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్ ఇచ్చారని చెప్పి..ఈయనపై పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకటరావు కోర్టుకు వెళ్లారు. దీనిపై నాలుగున్నర ఏళ్ల విచారణ తర్వాత..కోర్టు తీర్పు ఇస్తూ..ఎమ్మెల్యే వనమా పదవిపై వేటు వేసింది..మరో ఐదేళ్ల పాటు పోటీ చేయకూడదని తీర్పు ఇచ్చింది. దీంతో సెకండ్ ప్లేస్ లో ఉన్న జలగంకు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ వచ్చింది.
అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా..తర్వాత బిఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వనమా, జలగంకు పడటం లేదు. ఇక వనమా తనయుడు వివాదాల వల్ల..ఆయనకు మైనస్ అయింది. నెక్స్ట్ సీటు కూడా డౌట్ లో పడింది. ఇప్పుడు ఎలాగో వేటు పడటంతో కొత్తగూడెం రేసు నుంచి వనమా అవుట్ అయ్యారు. మరి కొత్తగూడెం సీటు జలగం కు దక్కుతుందా? అది డౌటే.
ఎందుకంటే అపోజిట్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నీ రకాలుగా బలంగా ఉన్న పొంగులేటిని ఢీకొట్టడం జలగంకు కాస్త కష్టమే. దీంతో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు సైతం కొత్తగూడెంపై ఫోకస్ పెట్టారు.
అందుకే ప్రభుత్వ అధికారిగా ఉంటూ కూడా కేసిఆర్ కు భజన చేయడం, ఆయన కాళ్ళకు మొక్కడం చేస్తున్నారు. అలా అని గడలకు సీటు వస్తుందనే గ్యారెంటీ లేదు. మరి కాంగ్రెస్ నుంచి పొంగులేటి రేసులో ఉన్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటారో చూడాలి.