భారీ వర్షాలు.. ప్రజలకు అండగా ఉండాలని రెడ్ క్రాస్ సొసైటీకి గవర్నర్ సూచన

-

రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​ను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇక పలు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారికి తిప్పలు తప్పడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజ్ భవన్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 33 జిల్లాల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని.. స్థానిక జిల్లాల్లోని పరిస్థితులను గవర్నర్‌కి వివరించారు. వరదల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాల గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. సభ్యులు ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటూ.. వరద పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని గవర్నర్ రెడ్ క్రాస్ సభ్యులను సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news