ఏపీలో కులాల వారీగా రాజకీయం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కులాల మద్ధతు పొందేందుకు పార్టీలు కుల రాజకీయం చేస్తాయి. ఆయా కులాల మధ్య చిచ్చు కూడా పెడతాయు. అలాగే ఎన్నికల సమయంలో అది చేస్తాం..ఇది చేస్తామని హామీలు ఇస్తాయి. అలా చేసి కులాల మద్ధతు దక్కించుకోవాలని చూస్తాయి. అయితే ఏపీలో బిసి కులాల వారు ఎక్కువగా ఉంటారని తెలుస్తుంది. వీరు వన్‌సైడ్ అయితే విజయం వన్ సైడ్ అనే చెప్పవచ్చు.
అందుకే బిసిలపైనే ప్రధాన పార్టీలు ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ప్రతి నియోజకవర్గంలో బిసి ఓటర్లు లేకుండా ఉండరు. అయితే టిడిపి ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో బిసిలకు ప్రాధాన్యత పెరిగింది. ఎన్టీఆర్..బిసిలకు రాజ్యాధికారం దక్కేలా చేశారు. బిసిలకు రిజర్వేషన్లు పెంచారు. బిసిల్లో చాలమందిని నాయకులు గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత బిసిలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. బిసి కుల వృత్తులని ప్రోత్సహించారు. అందుకే టిడిపిని బిసిల పార్టీ అనే వారు. కానీ నిదానంగా టిడిపిలో ఒక అగ్రకులం పెత్తనం పెరగడం..బిసిలకు పదవులు ఉన్న పెత్తనం మాత్రం ఒక అగ్రకులం చేతిలోనే ఉండటంతో పరిస్తితులు మారిపోయాయి.
బిసిల్లో మార్పు కనిపించింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక బిసిలకు పెద్దగా ప్రాధాన్యత లేదు..వారికి ఒరగబెట్టింది కూడా ఏమి లేదు. దీంతో 2019 ఎన్నికల్లో మెజారిటీ బిసి వర్గాలు వైసీపీ చూశాయి. జగన్‌కు మద్ధతు తెలిపాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక బిసిలో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు. వాటికి ఛైర్మన్‌లని నియమించారు. బిసి వర్గాలకు పథకాలు అందిస్తున్నారు. దీంతో బిసిల మద్ధతు జగన్‌కు తగ్గడం లేదు.
అయితే జగన్ బిసిలకు చేసిందేమి లేదని, జగన్ అధికారంలోకి వచ్చాక బిసిలపై దాడులు పెరిగాయని, బిసి కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, అసలు బిసిలకు న్యాయం జరగడం లేదని టిడిపి అంటుంది. ఈ క్రమంలోనే బిసిలని మళ్ళీ ఆకర్షించేందుకు టిడిపి చూస్తుంది. తాజాగా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా జయహో బిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జగన్ ప్రభుత్వంలో దాడులకు గురైన వారిని తీసుకొచ్చి మాట్లాడించారు. అలాగే బిసిల కోసం టిడిపి అధికారంలోకి రాగానే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. టిడిపి రాగానే బిసి పథకాలని పునరుద్దరిస్తామని, కుల వృత్తుల వారికి ప్రత్యేకంగా అండగా ఉంటామని పలు హామీలు ఇచ్చారు. ఇలా ఎవరికి వారు బిసి ఓటర్లని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చివరికి బిసిలు ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.