ప్రభాస్​తో క్లాష్.. ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ క్లారిటీ ఇదే

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​పై ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నోరు పారేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగ ఈ రూమర్స్​పై వివేక్ క్లారిటీ ఇచ్చారు.

‘ప్రభాస్‌ సినిమాతో మరోసారి పోటీ పడుతున్నాననే మాటలను.. నాకు ఆపాదించి ఎవరు ఈ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తున్నారు? నాకు ప్రభాస్‌పై అమితమైన గౌరవం ఉంది. ఆయన మెగా.. మెగా స్టార్‌. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. కానీ, మేము స్టార్‌ నటీనటులు లేకుండా తక్కువ బడ్జెట్‌లో ప్రజల కోసం చిత్రాలు చేస్తుంటాం. మా మధ్య ఎలాంటి పోలికల్లేవు. దయచేసి నన్ను వదిలేయండి’ అంటూ వివేక్​ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివేక్.. ఫ్రీ లైఫ్‌కు అలవాటు పడిన కొందరు నటులు.. దేవుళ్ల పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news