గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 54.6అడుగులకు చేరిన నీటిమట్టం

-

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం అటు అధికారులను.. ఇటు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వర్షాలు తగ్గినా.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో తాజాగా నీటి మట్టం 54.06 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అల మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ప్రతిగంటకూ గోదావరి వరద తీవ్రత పెరుగుతూ వస్తోంది.

ఎగువ ప్రాంతాల్లోని ఏటూరునాగారం, పేరూరు నుంచి వరద వస్తుండటంతో.. 55 అడుగులకు వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటల వరకు ముంపు ప్రాంతాల్లోని 11,505 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ ఇక్కడే మకాం పెట్టి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సేవల నిమిత్తం హెలికాప్టర్‌తోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news