ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే.. రూ. 25 లక్షలు డిపాజిట్‌ చేయాలంట..!!

-

ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే నెల, లేదా రెండు నెలల అద్దె ముందే కట్టించుకునే ఓనర్లను చూశాం. సిటీల్లో అయితే ఏకంగా ఒకేసారి ఆరునెలల అద్దె కూడా కట్టించుకుంటారు. కానీ ఇళ్లు అద్దెకు కావాలంటే.. 25 లక్షలు డిపాజిట్‌ చేయమనే ఓనర్లను చూశారా..? ఏంటి భయ్యా ఆ డబ్బు పెడితే 1BHK ఫ్లాట్‌ వస్తుందేమోగా అంటారా..? రావొచ్చు. కానీ ఇక్కడ ఇళ్లు అద్దెకు కావాలంటే.. రూ.25 లక్షలు డిపాజిట్‌ చేయాల్సిందేనట. మీకు ఈపాటికే ఇది ఎక్కడో తెలిసి ఉండాలే..? అదేనండి బెంగుళూరులో. బెంగుళూరులో ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే ఎన్ని కండీషన్స్‌ పెడతారో మనకు తెలిసే ఉంటుంది. బాయ్‌ఫ్రండ్‌ ఉండకూడదు, ఉద్యోగం చేసే ఆఫీస్‌లో లెటర్స్‌ తీసుకోవాలి, ఈ టైమ్‌ దాటితే రానివ్వరూ, కొంతమంది అయితే పెళ్లికాని వాళ్లకు అస్సలు అద్దెకు ఇవ్వరు.. ఇవన్నీ అయితే ఎలాగోలా మాన్యేజ్‌ చేసుకోవచ్చు..కానీ పాతిక లక్షలేంటండీ..!

ఒక ఫ్లాట్ అద్దె నెలకు రూ. 2.5 లక్షలు అట. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 25 లక్షలు చెల్లించాలట. దీనిని చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టమో రేట్లు ఎలా ఉన్నాయో వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ నో బ్రోకర్ సైట్‌లో అతడు చూసిన ఇల్లు అద్దెకు సెక్యూరిటీ డిపాజిట్‌కే రూ. 25 లక్షలు చెల్లించాలట. తేజస్వీ శ్రీవాత్సవ అనే ఒక వ్యక్తి గురువారం రోజు దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. HSR లేఅవుట్ ఏరియాలోని 4Bhk ఫ్లాట్ రెంట్ కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్ (సెక్యూరిటీ డిపాజిట్) రూ. 25 లక్షలు కట్టాలని అందులో ఉంది.

మొత్తం 5915 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న హౌస్ రెంట్ కోసం నో బ్రోకర్ సైట్‌లో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మొత్తం లోన్ కూడా ఇస్తారని అందులో పేర్కొనడం హైలెట్. బెంగళూరులో అద్దె ఇళ్ల ధరలు,, అద్దెదారుల కష్టాలు ఎలా ఉన్నాయో దీనిని చూస్తే తెలిసిపోతుంది కదా..! ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. శ్రీవాత్సవ కూడా అక్కడ అప్లై లోన్ బదులు.. అప్లై ఫర్ కిడ్నీ డొనేషన్ అనే ఆప్షన్ కూడా యాడ్ చేయాలని చెప్పారు. దీనిపై నెటిజన్లు కూడా తమకు గతంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మీకు కూడా ఇళ్లు అద్దెకు తీసుకోవాలన్నప్పుడు ఇలాంటి ఘటనలు ఏమైనా ఎదురయ్యాయా..?

Read more RELATED
Recommended to you

Latest news