అవును అతడితో సంభంధం ఉంది…అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు..!!!

-

అమెరికా కాంగ్రెస్ సభ్యురాలైన కేటి హిల్ తన కీలక మైన పదవికి రాజీనామా చేశారు. అందుకు గల కారణాన్ని ఆమె వివరించారు. అమెరికా కాంగ్రెస్ లోని ఒక ఉద్యోగితో శారీరక సంభంధం పెట్టుకున్నందుకు గాను ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. గత సంవత్సరం నవంబర్ లో కాలిఫోర్నియా నుంచీ యూఎస్ కాంగ్రెస్ కి ఎన్నికైన ఆమె తన రాజీనామా లేఖని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Image result for us congresswoman katie hill

కేటి హిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సమాజం, తన ప్రాంత, దేశ ప్రయోజనాల కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసమేనని తెలిపారు. తన ప్రవర్తన కారణంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఎటువంటి మాట రాకూడదనే కారణంతోనే తాను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపారు.

 

గతంలో తాను అమెరికా కాంగ్రెస్ కి ఎన్నికయ్యే సమయంలో బరిలో ఉండగా  తీవ్రంగా శ్రమించానని, ఆ సమయంలో తన ప్రచార సిబ్బందిలో  కీలక వ్యక్తిగా నిలిచిన ఒక వ్యక్తితో అక్రమ సంభంధం నెరిపినట్టుగా ఆమె అంగీకరించింది. అయితే కార్యాలయ సిబ్బంది ఎవరితో కూడా తనకి అక్రమ సంభంధం లేదని తేల్చి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news