అక్టోబర్ 29 మంగళవారం రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి

-

October 29 Tuesday Daily Horoscope
October 29 Tuesday Daily Horoscope

మేషరాశి : కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ని మార్చుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.
పరిహారాలు: స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎరుపు గంధం కలపండి.

వృషభరాశి : వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. మీరు వారిని ఉత్సాహపరచి మీ కలలను నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది. అనుభవజ్ఞులను కలుస్తారు, వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు.
పరిహారాలు: మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉండటానికి కార్తీకమాస నియమాన్ని పాటించండి.

మిథునరాశి : నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలని తెస్తుంది. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడును పాడు చేస్తుంది.
పరిహారాలు: బ్రహ్మీ మూహ్తురంలో స్నానం, ధ్యానం చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి : మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధుల కొరతకు దారితీయగదు. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ప్రదానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోష కారకంగా పొందుతారు. ఏ రంగంలో మీరునిమగ్నమైనా కానీ, మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. ప్రయాణం ప్రయోజనకరమే. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
పరిహారాలు: ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు, తేనెను ఉపయోగించండి. దానం చేయండి.

సింహరాశి : మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. ఈ రోజు, మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. పని విషయంలో అన్ని అంశాలూ మీకు సానుకూలంగా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.
పరిహారాలు: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.

కన్యారాశి : దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకొండి. బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ పై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులను పూర్తిచెయ్యండి. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు.
పరిహారాలు: వృత్తిలో మెరుదల కోసం, నీటిలో పాలు, బియ్యం కలిపి చంద్ర భగవానుడికి అందించండి.

తులారాశి : మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీస్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు. మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. జీవిత భాగస్వామి ఆనందంతో గడపండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం.
పరిహారాలు: పరమశివుడికి అభిషేకం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

వృశ్చికరాశి : రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చవిచూడనున్నారు. ఈరోజు మీరు, ఇంటరెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.
పరిహారాలు: మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడం కోసం కార్తీకమాస నియమాన్ని పాటించండి.

ధనుస్సురాశి : సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా మీ మనసును సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక, ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్ గా సానుకూలంగా స్పందిస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్తా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు.
పరిహారాలు: మీ ఆర్థిక ప్రయోజనాల కోసం శివుడిని నిత్యం బిల్వదళాలతో అర్చించండి.

మకరరాశి : అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. ఈ రోజు దూరప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
పరిహారాలు: ఓం నమో భగవతే వాసుదేవయ 28 లేదా 108 సార్లు పఠించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి : అందమైన సున్నితము కమ్మని సువాసన, ఉన్న కాంతివంతమైన పూవు వలె, మీ ఆశ వికసిస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.
పరిహారాలు: వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం, ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రీ మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

మీనరాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.
పరిహారాలు: మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం నిత్యం ఓం నమఃశివాయ పంచాక్షరీ జపించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news