నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. అయితే రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నారా? అని మీడియా మిత్రులు అడగగా… ఇన్ని చెప్పిన అన్ని పటాకులు ఒకసారే కాలుస్తారా అంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
అంటే రుణ మాఫీ పై ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తెలంగాణ కేబినెట్ విషయాలకు వస్తే…ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని…ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది అవుతారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు ప్రకటించారు. వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల చేస్తామని…జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ నిర్మిస్తామని వెల్లడించారు. ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు ఉంటుందని తెలిపారు.