అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ ఏదో వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన రెండు కేసుల్లో చిక్కుకున్నారు. రహస్య పత్రాల తరలింపు కేసు, పోర్న్ స్టార్ స్టార్నీ డేనియల్స్ వ్యవహారంలో డొనాల్డ్ ట్రంప్‌పై గతంలోనే కేసులు నమోదయ్యాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు ట్రంప్.
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌బీఐ).. క్రిమినల్ కేసు నమోదు చేసింది. అలాగే ఎన్నికల యంత్రాలను స్వాధీనం చేసుకోవడం, ట్యాంపరింగ్ ఆరోపణలపై ట్రంప్ సన్నిహితుడిపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.
2020లో ట్రంప్ మద్దతుదారులు వైట్‌హౌస్‌పై దాడి కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. అలాగే ఆ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలపై తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ట్రంప్.. గురువారం కోర్టును హాజరుకానున్నట్లు తెలుస్తోంది.