బ్రో సినిమా ఆర్ధిక లావాదేవీల పై మంత్రి అంబటి రాంబాబు ఫోకస్ పెట్టారు. బ్రో సినిమా నిర్మాణానికి అయిన వ్యయం ఎంతో నిర్మాత ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నిస్తోంది అంబటి వర్గం. ఇందులో భాగంగానే… బ్రో కలెక్షన్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయననున్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ వివరాలు ఎందుకు బహిర్గతం చేయటం లేదు? బ్రో సినిమా వసూళ్ళ పై రహస్యం ఎందుకు?? అనే అంశాలపై కౌంటర్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అంబటి రాంబాబు.
పవన్ కళ్యాణ్ కు అమెరికా నుంచి నిధుల రూటింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు అంబటి. కేంద్ర దర్యాప్తు సంస్థలే నిగ్గుతేల్చగలవని భావిస్తోంది అంబటి వర్గం. ఇందులో భాగంగానే.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డితో అంబటి భేటీ అవనున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లి… తన దగ్గర ఉన్న సమాచారాన్ని విజయసాయిరెడ్డికి అంబటి అందించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈడీ, సీబీఐ, ఇతర నిఘా సంస్థలకు బ్రో సినిమా ఆర్ధిక లావాదేవీల అనుమానాలు, ప్రాధమిక ఆధారాలు అందించే అవకాశం ఉంది.