అంబటి వర్సెస్ జనసేన..’సినిమా’ రాజకీయం..వేరే పనిలేదా.!

-

ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేనల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. మొదట నుంచి అంబటి..పవన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే పవన్ సైతం అంబటిపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇటీవల పవన్ నటించిన బ్రో చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో శ్యాంబాబు అనే పాత్ర ద్వారా అంబటిని ఇమిటేట్ చేశారనే టాక్ వచ్చింది.

దీనిపై అంబటి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైర్ అయ్యారు. కొన్ని పాత్రలని పెట్టి శునక ఆనందం పొందుతున్నారని, అలాగే బ్రో సినిమా ఫ్లాప్ అయిందని, ఆ సినిమా కలెక్షన్లు కూడా అంబటి చెబుతూ ఉన్నారు. ఇక బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌కు అమెరికాలో, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయని, చంద్రబాబు ముఠా డబ్బులు కలెక్ట్ చేసి విశ్వ ప్రసాద్‌‌కు ఇస్తే.. ఆయన పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఇచ్చే ప్యాకేజీని సినిమాల రూపంలో అందజేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప‌వ‌న్‌పై మేము కూడా సినిమా తీయాల‌ని అనుకుంటున్నామని,  ఈ క‌థ‌కు నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి-ఎగ‌తాళి, మూడు ముళ్లు -ఆరు పెళ్లిళ్లు తదిత‌ర పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయని అన్నారు.

దీనికి జనసేన కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అంబటి హీరోగా SSS సినిమాను ప్రారంభిస్తూ పూజలు చేసింది. ప్రోడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యామ్ బాబు @ రాంబాబు పోస్టర్ ను విడుదల చేసింది. ఇలా అంబటి, జనసేన మధ్య వార్ నడుస్తుంది.

అయితే ఓ వైపు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శిస్తూ..అసలు జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి..బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారని చెప్పి వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇలాంటి వాటి వల్ల జగన్‌కు నష్టం తప్ప లాభం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news