పించన్ సొమ్ముతో జూదమాడి…ఓ వాలంటీర్ అడ్డంగా .దొరికిపోయాడు. అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామ వాలంటీర్ ఆగస్టు 1 వైయస్సార్ ఆసరా పెన్షన్ డబ్బులను అధికారుల నుండి రూ. 89,000 నగదు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా నేరుగా కర్నూలు జిల్లా గుమ్మనూరుకు వెళ్లి అక్కడ పింఛన్ డబ్బులతో జూదమాడాడు.
ఈ క్రమంలో పింఛన్ డబ్బులతో పాటు చేతికున్న బంగారు ఉంగరం, సెల్ ఫోన్ కూడా పోగొట్టుకున్నాడు. దీంతో విషయం బయటపడకుండా కట్టు కథ అల్లాడు. పింఛన్ డబ్బులు తీసుకుని గ్రామానికి వెళుతుండగా ఇద్దరు దుండగులు తనను కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి దారి దోపిడీకి పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేశాడు. వాలంటీర్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపడంతో వాలంటీర్ నిర్వాకం బయటపడింది.