హర్యానా అల్లర్లు.. రంగంలోకి బుల్డోజర్లు.. నిందితుల ఇళ్ల కూల్చివేత

-

హర్యానాలోని నూహ్‌ జిల్లాలో అల్లర్లు రోజురోజుకు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అల్లర్లను కట్టడి చేసేందుకు బుల్డోజర్లను రంగంలోకి దింపింది. అల్లర్లకు కారణమైన నిందితులపై బుల్డోజర్ యాక్ట్ షురూ చేసింది. ఇందులో భాగంగా.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నూహ్‌ జిల్లాలోని తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించారు. అక్రమంగా వలసవచ్చిన వీరు అల్లర్లలో పాల్గొ న్నట్లు అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి గత నాలుగేళ్లలో వలస వచ్చిన వారు ఇక్కడ స్థలాలను కబ్జాచేసి ఈ పూరి గుడిసెలు నిర్మించినట్లు హర్యానా పట్టణాభివృద్ధి శాఖ చెబుతోంది. భారీ ఎత్తున పోలీసు దళాలు శుక్రవారం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో వీరు పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు వారు దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ఇదే విధమైన ఆపరేషన్‌ను నల్హార్‌ గ్రామంలో కూడా పోలీసులు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news