ఇట్స్ రివేంజ్ టైం.. తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

-

రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి భీకరంగా కొనసాగుతోంది. గ్యాప్ లేకుండా రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. తమ ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై దాడులు చేస్తూ పొట్టకొట్టాలనుకుంటున్న పుతిన్​కు జెలెన్​స్కీ ఆర్మీ గట్టిగా సమాధానమిస్తోంది. తాజాగా నల్లసముద్రంలో రష్యాకు చెందిన పోర్టు నోవోరోసిస్క్‌పై ఇవాళ ఉక్రెయిన్​ ఓ సముద్ర డ్రోన్‌ దాడి చేసింది. ఈ ఓడరేవు రష్యా ఎగుమతులకు అత్యంత కీలకమైంది. దీంతో ఈ పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ చమురు టర్మినల్‌ను నిర్వహించే కాస్పియన్‌ పైప్‌లైన్‌ కన్సార్టియం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇక్కడ భారీ ఎత్తున కాల్పులు జరిగినట్టు.. అక్కడి ఇన్​ఫ్లుయెన్సర్లు చెప్పారు. తాజాగా ఈ విషయాన్ని నోవోరోసిస్క్‌ ఎమర్జెన్సీ సర్వీసు బృందాలు కూడా ధ్రువీకరించాయి. తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్‌ దాడి చేసినట్లైంది పౌర నౌకలకు రక్షణగా వెళ్తున్న సైనిక ఓడలపై దాడులు జరిగినట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని వెల్లడించింది. తమ నౌక ఆ డ్రోన్‌ను పేల్చివేసిందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news