వైసీపీకి శని పట్టింది..ఓడిపోవడం ఖాయం – వైసీపీ ఎంపీ

-

వైసీపీకి శని పట్టింది..ఓడిపోవడం ఖాయం అన్నారు వైసీపీ రెబల్‌ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.తమ పార్టీకి శని పట్టిందని, త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు గత నాలుగేళ్లుగా పట్టుకున్న శని వీడి, శుక్ర దశ మొదలు కాబోతుందని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై నెగ్గాలని కుట్రలు చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిద్దామని ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలను కోరారు. రాష్ట్ర హైకోర్టు చాచి పెట్టి కొట్టినా ప్రభుత్వానికి సిగ్గు రాలేదన్నారు. అమరావతి ఆర్ -5 జోన్ లో ఇళ్ళ నిర్మాణానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చినా బుద్ధి రాదా మీకని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు.

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తామని పట్టాపై రాసి ప్రధానం చేశారు కదా, పట్టాపై వ్రాసిన తర్వాత ఇలా మాట్లాడుతారేమని న్యాయమూర్తులు ప్రశ్నించగా… అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరో తప్పుగా రాశారని పేర్కొనడం, కోర్టును తప్పు దారి పట్టించడమేనని అన్నారు. బై మిస్టేక్ ప్రింట్ అయి ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మరో న్యాయవాది జగన్ మోహన్ రెడ్డిలు పేర్కొన్నారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, ప్రొసీడింగ్స్ సుధాకర్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డిలు చదివారా?, చదివే కోర్టులో వాదనలు వినిపించారా? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news