గవర్నర్ పై బట్టకాల్చి మీద వేస్తున్నారని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. గవర్నర్కు బిల్లు పంపారు. బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలన్నారు ఈటల. గవర్నర్ అందుబాటులో లేరు అని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఆగ్రహించారు ఈటల రాజేందర్.
గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ANM లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి అందుబాటులో ఉండరని మండిపడ్డారు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలని కోరారు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారు…రేపు కేసీఆర్ దాడి చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఆర్టీసిలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని… ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు ఈటల రాజేందర్.