ఇవాళ తిరుమల టిటిడి పాలకమండలి సమావేశం జరుగనుంది. రేపటితో ప్రస్తూత టీటీడీ పాలకమండలి గడువు ముగియనుంది. ఇక నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి నియామకం ఇప్పటికే జరిగింది. ప్రస్తూతం పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వనితుడిగా కొనసాగుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ సమావేశంలో ప్రస్తూత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి….కాబోయే చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా పాల్గొంటారు.
కాగా, ఈ నెల 10వ తేదిన టిటిడి నూతన పాలకమండలి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు భూమనా కరుణాకర్ రెడ్డి. ఇక అటు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉండగా… టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 83,856 మంది భక్తులు దర్శించుకోగా… 28,403 మంది భక్తులు తరనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు చేరింది.