చిరంజీవి, పవన్ జూబ్లీహిల్స్ లో కట్టిన ఇల్లు కొండ మీద కాదా ? అని పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెబ్ సిరీస్ పార్ట్ 3 కొనసాగుతుందని…రుషికొండ వద్ద ఎదో హడావుడి చేసి మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహించారు. నువ్వు మీ డాడీ చంద్ర బాబు కన్నా పెద్ద దండు పాళ్యం బ్యాచ్ ఏం ఉంటుందంటూ ఎద్దేవా చేశారు.
ప్యాకేజీ కి అమ్ముడు పోయావ్..2 లక్షల పుస్తకాలలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివి ఉంటే మంచిదని చురకలు అంటించారు. రుషి కొండ వద్ద పవన్ కళ్యాణ్ అన్నయ్య చెప్పినట్టు ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేది…చంద్ర బాబు బంధువు కాబట్టే గీతం కాలేజీ అక్రమ నిర్మాణం, కబ్జా పవన్ కళ్యాణ్ కి కనిపించలేదని మండిపడ్డారు. పవన్‌పై ప్రభుత్వం మరోసారి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందని.., రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు ఎగురవేశారని ఫైర్ అయ్యారు. అనుమతి లేకుండా చేసిన పనికి పోలీస్ కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అమర్నాథ్.