YSR మరణంపై టిడిపి నేత బుద్ద వెంకన్న వివాదస్పద వ్యాఖ్యలు చేశారు..ఏడు కొండలను మూడు కొండలు అన్నందుకే.. రాజశేఖర్ రెడ్డికి ఆ గతి పట్టిందంటూ ఫైర్ అయ్యారు బుద్దా వెంకన్న. ఇవాళ టిడిపి నేత బుద్ద వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ లో సీఎం క్యాంప్ ఆఫీస్ అని సోషల్ మీడియా లో పోస్టు చేసారు…మళ్లీ ఆ పోస్టు డిలీట్ చేసారని వైసీపీపై ఫైర్ అయ్యారు. రుషికొండ మీద సీఎం కార్యాలయాలు కట్టకూడదని తప్పు అని వైసీపీకి తెలుసు అని.. అమర్నాథ్ నీచంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రుషికొండ లో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉందని.. రుషికొండ లో సీఎం కార్యాలయం కడితే తప్పేంటి అంటున్నాడని అమర్నాథ్పై సీరియస్ అయ్యారు టిడిపి నేత బుద్ద వెంకన్న. వేంకటేశ్వర స్వామితో జగన్ ని పోలుస్తున్నాడు…గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను మూడు కొండలు అన్నాడు..ఆ తర్వాత ఎం జరిగిందో అందరికీ తెలుసు అంటూ హెచ్చరించారు. జగన్ మంత్రి పదవి ఇచ్చాడని వేంకటేశ్వర స్వామి తో పోల్చుతున్నాడని అమర్నాథ్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి నేత బుద్ద వెంకన్న.