కొడాలిని టార్గెట్ చేస్తున్న రాము..గుడివాడలో సీన్ రివర్స్.!

-

నాలుగుసార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా చేశారు..అయినా సరే గుడివాడకు కొడాలి నాని చేసిందేమి లేదు. అభివృద్ధి శూన్యం, రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది. బస్టాండ్ బాగోలేదు. చిన్న వర్షానికే మునుగుతుంది. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు..గ్రామాల్లో రోడ్ల వసతి బాగోలేదు. తాగునీటి సౌకర్యం అందడం లేదు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయని గుడివాడ టి‌డి‌పి నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇంతకాలం కొడాలి నాని..చంద్రబాబుని తిడుతుంటే కౌంటర్లకు ఇవ్వడానికి కూడా తెలుగు తమ్ముళ్ళు ఆలోచించేవారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చేవారు. అక్కడ ప్రజా సమస్యలపై పెద్దగా పోరాటం చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. దీంతో సీటు దక్కించుకోవడం కోసం అటు ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు, ఇటు ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు పోటీ పడి కొడాలిపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఎందుకో గాని ఈ మధ్య రావి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాము లైన్ లోకి వచ్చారు.

గుడివాడలో ఆయన పర్యటిస్తున్నారు..ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. సొంత డబ్బులతో పలు పనులు చేయిస్తున్నారు. కాలువల పూడిక తీయిస్తున్నారు. ఇటీవల వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులకు అండగా నిల్బడుతున్నారు.ఇదే సమయంలో వర్షాలకు గుడివాడలో పంట పొలాలు మునగలేదని కొడాలి అనడంపై ఫైర్ అవుతున్నారు.

తాజాగా రైతులకు టీడీపీ నేత వెనిగాండ్ల రాము సంఘీభావం తెలిపి.. చెరువులను తలపించేలా పొలాలు మునిగి.. రైతులకు పెను నష్టం జరిగిందని, గుడివాడలో నాట్లు మునగలేదని.. రైతులు నష్టం జరగలేదని ఎమ్మెల్యే నాని అనడం బాధ్యతారహిత్యమన్నారు. ఇలా రాము..కొడాలిని టార్గెట్ చేశారు. ఇక రాము లైన్ లోకి రావడంతో రావి వెనక్కి వెళ్లారు. దీంతో గుడివాడ టి‌డి‌పి సీటు రాముకే అని ప్రచారం జరుగుతుంది. అందుకే రాము దూకుడుగా ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news