విజన్ 2047 అని చందబ్రాబు కొత్త రాగం మొదలు పెట్టారని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైెస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు బాబు అని మండి పడ్డారు పేర్ని నాని.
చంద్రబాబు ది సుత్తి విజన్ అని..గతంలో చంద్రబాబు చెప్పిన విజన్ 2020 ఏమైంది అని ప్రశ్నించారు. ఆయన విజనరీ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయింది. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశానని చెప్పుకునే దమ్ముందా..? అసలు చంద్రబాబు కుప్పంకి కనీసం నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శన అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. ఆవగింజంత సిగ్గు లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఎవ్వరిని మోసం చేద్దామని ప్రాజెక్టులను సందర్శిస్తున్నావని ప్రశ్నించారు నాని. విజన్ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకి విజన్ ఉందా ? అని ప్రశ్నించారు.