దుల్కర్ సల్మాన్.. ఈ మల్లు హీరోకు తెలుగులోనూ యమా క్రేజ్ ఉంది. డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా మహానటి వంటి చిత్రంలో నటించి.. సొంతగా డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రేక్షకులను అలరించాడు దుల్కర్. ఇక అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ హీరోను ఓ తెలుగవాడిగానే భావించడం మొదలుపెట్టారు. ఇది దుల్కర్ సినిమాలకు బాగా కలిసి వస్తోంది. ఏ సినిమా తీసినా.. అది తెలుగులో కూడా డబ్బింగ్ చేసి నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు.
గన్స్ అండ్ గులాబ్స్.. కింగ్ ఆఫ్ కోథా సినిమాలతో దుల్కర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానున్న కింగ్స్ ఆఫ్ కోథా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీలో తన పాత్ర గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చేశాడు.
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దుల్కర్ సమాధానమిస్తూ.. కల్కి గురించి ఏం చెప్పలేను. కానీ సెట్‌కు వెళ్లాను. మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. ఇలాంటి ఆలోచన కేవలం నాగ్ అశ్విన్‌తో మాత్రమే సాధ్యమవుతుంది. సర్ప్రైజెస్ ఇచ్చే దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్ అన్నాడు. మీకు ఎవరి కాంబినేషన్లో సీన్లుంటాయని అడిగితే.. నవ్వుతూ ఏం చెప్పలేనంటూ.. వేరే టాపిక్కు వెళ్దామన్నాడు. మొత్తానికి కల్కిలో సర్ప్రైజ్ మాత్రం ఉండబోతుందని చెప్పకనే చెప్పాడన్నమాట ఈ మల్లు హీరో.
The way he laughed it off, It seems like he's doing a cameo role in #Kalki2898AD 😳🔥#DulquerSalmaan pic.twitter.com/wDQURkm7ll
— Yung Lee🗿 (@Libinmathew_) August 17, 2023