ఈ నెల 27న ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ

-

ఖమ్మంలో గత నెలలోనే  జరగాల్సిన అమిత్ షా  బహిరంగ సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే ఈ నెల 27 న సభ జరగబోతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన శాయాశక్తులా పని చేయాలని.. కుటుంబ సభ్యులతో హాజరు కావాలని సూచించారు. మోడీ ని ఎదుర్కోలేక కుటంబ పార్టీలు,సిద్ధాంతం లేని పార్టీలు ఏకమయ్యాయన్నారు. ఈసారి దేశంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని పేర్కొన్నారు. ఇంకా సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. సర్వేలన్నీ కూడా NDA కు అనుకూలంగా వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు కిషన్ రెడ్డి. 

మోడీ ప్రభుత్వం దేశంలో బాంబు పేలుళ్లు,తీవ్రవాదం,ఉగ్రవాదం అరికట్టిందన్నారు. ఒక్క నయా పైసా అవినీతి జరగలేదని.. దేశం కోసం,సమగ్రత కోసం నీతివంతమైన పాలనా అందించిన పార్టీ బీజేపీ అని వెల్లడించారు. దాదాపు 84 కోట్ల ప్రజలకు ఉచితంగా 5 కేజీల బియ్యం 3న్నర ఏళ్లుగా ఇస్తున్నామని తెలిపారు. మోడీ వచ్చాక ఎరువుల ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని.. 18 వేలు సబ్సిడీ బీజేపీ రైతుల కు ఇస్తుందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news