ధనుష్ – ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఆ ఇళ్లేనా..?

-

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త స్టార్ హీరో ధనుష్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి ఈ విషయం గురిచేసిందని చెప్పాలి. వీరిద్దరూ విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం వెలుగులోకి రాలేదు. ప్రముఖ హీరోయిన్ వల్లే ధనుష్ – ఐశ్వర్య విడిపోయారు అంటూ ప్రచారం జరిగినా తాజాగా అందులో నిజం లేదని తెలుస్తోంది. అయితే వీరు విడిపోవడానికి కారణం మాత్రం ఇల్లు అని సమాచారం.

పెళ్లయి, ఇద్దరు కొడుకులు జన్మించి.. వైవాహిక బంధం లో 18 సంవత్సరాల పాటు సంతోషంగా గడిపిన ఈ జంట ఇలా ఉన్నట్టుండి విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం ధనుష్ చెన్నై లో ఉన్న పోయేస్ గార్డెన్ లో ఒక ఇంటిని నిర్మించగా.. దానికోసం ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేశాడు ధనుష్. అయితే అక్కడ ధనుష్ ఆ ఇంటిని నిర్మించడం రజనీకాంత్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. అంతేకాదు ధనుష్ ఎంచుకున్న ఆ ప్లేస్ సరైనది కాదు అని.. ఆ ప్లేస్ లో ఇల్లు కట్టిస్తే వాస్తు సంబంధిత సమస్యలతో పాటు కుటుంబంలో కలహాలు వస్తాయని రజిని ముందే భావించి ఈ విషయాన్ని ధనుష్ కి చెప్పారట. అయితే ధనుష్ మాత్రం వీటిని పట్టించుకోకుండా ఇల్లు నిర్మించాడు.

ఇక ఇంటి పనులు మొదలైన తర్వాత ధనుష్ ,ఐశ్వర్య మధ్య గొడవలు మొదలయ్యాయట.తన నాన్న కంటే రిచ్ గా ఇల్లు ఎందుకు కడుతున్నావు అని ఐశ్వర్య ప్రశ్నించడంతోనే ఈ గొడవ మొదలైందని సమాచారం. అయితే ఇలా ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుని చివరికి విడాకులు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news