జాబిల్లి కొత్త ఫొటోలు పంపిన ల్యాండర్ విక్రమ్​

-

చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో చంద్రయాన్-3 మిషన్​ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఒక్కో దశ దాటుతూ సక్సెస్​ఫుల్​గా జాబిల్లి వద్దకు చేరుకుంటోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరా (LHDAC) తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 19వ తేదీన తీసిన ఈ చంద్రుని చిత్రాలను ఇస్రో.. ఎక్స్​ (ట్విటర్​)లో పోస్ట్ చేసింది.

బండరాళ్లు లేదా లోతైన గుంతలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది. మరోవైపు ఈనెల 23వ తేదీన చంద్రుని దక్షిణ ధ్రువంపై ‘విక్రమ్​’ సాఫ్ట్ ల్యాండింగ్​కు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయాన్ని ముందు 23వ తేదీ సాయంత్రం 5.45నిమిషాలకు నిర్ణయించిన ఇస్రో… తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6.04 నిమిషాలకు మార్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను తిలకించే విధంగా దేశవ్యాప్తంగా లైవ్ ఇచ్చేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news