లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు అంతంత మాత్రమే వస్తున్న విషయం తెలిసిందే. ఒకో నియోజకవర్గంలో కాస్త పర్లేదు అనిపిస్తే..మరొక చోట పెద్దగా జనం ఉండటం లేదు. అలాగే లోకేష్ పాదయాత్ర వల్ల కొన్ని నియోజకవర్గాల్లో టిడిపికి కాస్త ప్లస్ అవుతుంది..కొన్ని చోట్ల ఆ ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికే విజయవాడలోని మూడు స్థానాలు, పెనమలూరులో పాదయాత్ర పూర్తి చేసుకుని గన్నవరంలోకి ఎంట్రీ ఇచ్చారు.
విజయవాడలో టిడిపికి పట్టు ఉంది..కాబట్టి అక్కడ పాదయాత్ర బాగానే జరిగింది. ఇక పెనమలూరులో రాత్రి 3 గంటల వరకు పాదయాత్ర కొనసాగింది..అప్పటికి కాస్త జనం ఉన్నారు. ఇప్పుడు గన్నవరంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక గన్నవరంలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది..ఆ ప్రభావం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏ మేర పడుతుందనేది చూడాలిస్ ఉంది. గత ఎన్నికల్లో వంశీ టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పటినుంచి టిడిపి కంచుకోటగా ఉన్న గన్నవరం..వైసీపీ అడ్డాగా మారిపోయింది.
గన్నవరంలో వంశీకి ఫాలోయింగ్ ఎక్కువ. ఇదే సమయంలో వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావుని టిడిపిలోకి తీసుకొస్తున్నారు. దీంతో కాస్త రాజకీయాలు మారుతున్నాయి. అయినా వంశీకి గన్నవరంలో చెక్ పెట్టడం అనేది ఈజీ కాదు.
యార్లగడ్డని టిడిపిలోకి తీసుకున్న, లోకేష్ పాదయాత్ర చేసిన గన్నవరంలో పెద్దగా ప్రభావం చూపలేరు. ఎందుకంటే వంశీకి ప్రజా మద్ధతు ఎక్కువ. రాజకీయంగా ఎలా ఉన్నా..ఆయన ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారు..అందుకే ఆయనకు ఆధిక్యం ఎక్కువ. కాబట్టి లోకేష్ పాదయాత్ర సైతం వంశీని నిలువరించడం కష్టమని చెప్పవచ్చు.