ఈరోజుల్లో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేనిని నమ్మొచ్చు దేనిని నమ్మకూడదు అనేది కూడా తెలియట్లేదు. అనేక ఫేక్ వెబ్సైట్స్ వచ్చేసాయి ఇటువంటి ఫేక్ వెబ్సైట్లకి సమాచారాన్ని ఇస్తే మీరే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ ఖాతాదారులు ఫేక్ వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సంబంధిత సేవలు కోసం అపాయింట్మెంట్లని షెడ్యూల్ చేయడానికి అదనపు భారీ చార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఈ వెబ్సైట్లు. అలానే డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు మరి ఎటువంటి వెబ్సైట్లోకి దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. అలానే అధికారిక వెబ్సైట్ వివరాలను కూడా చూద్దాం. www.indiapassport.org అనేది నకిలీ వెబ్‌సైట్. అలానే www.online-passportindia.com కూడా నకిలీదే. ప్రభుత్వం పౌరులను ఈ వెబ్ సైట్ గురించి హెచ్చరించింది కూడా.
అలానే www.passportindiaportal.in కూడా నకిలీ వెబ్ సైట్ ఏ. అదే విధంగా www.passport-india.in వెబ్‌సైట్ గురించి కూడా భారత పాస్‌పోర్ట్ అథారిటీ హెచ్చరించింది. సో ఈ వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలి. www.passport-seva.in వెబ్‌సైట్, www.applypassport.org డాట్ ఓఆర్‌జీ పేరుతో వచ్చే ఇది కూడా నకిలీదే. అధికారిక వెబ్‌సైట్ విషయానికి వస్తే.. www.passportindia.gov.in ఏ నిజమైన వెబ్ సైట్.