ఫస్ట్ లిస్ట్ సంచలనం: 115మంది అభ్యర్ధులు వీరే..కేసీఆర్ రెండుచోట్ల.!

-

ఊహించని విధంగా అందరి అంచనాలని తారుమారు చేస్తూ..సి‌ఎం కే‌సి‌ఆర్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేశారు. అయితే ఎక్కువమంది సిట్టింగులని మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో..కేవలం 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కే‌సి‌ఆర్ పక్కన పెట్టారు. 119 సీట్లకు గాను..115 మంది అభ్యర్ధులని ప్రకటించారు. ఇంకా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లలో అభ్యర్ధులని తేల్చలేదు.

brs

వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేశారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ విదేశీ పౌరసత్వం వల్ల సీటు ఇవ్వలేకపోతున్నామని కే‌సి‌ఆర్ చెప్పారు. ఇటు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ తనయుడు సంజయ్‌కు సీటు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కే‌సి‌ఆర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ని పక్కన పెట్టారు. ఇక్కడ తాను పోటీ చేయడం వల్ల ఇది మార్పుల లెక్కలో లేదని అన్నారు.

brs

ఇలా పెద్ద సంచలనాలు లేకుండానే కే‌సి‌ఆర్ సీట్లు ప్రకటన చేశారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి, ములుగులో నాగజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సాయన్న కుమార్తె లాస్యలకు సీట్లు ఇచ్చారు. ఇక కాంగ్రెస్, టి‌డి‌పి ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు. మరి ఆయా స్థానాల్లో సీట్లు దక్కని బి‌ఆర్‌ఎస్ నేతలు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక రానున్న ఎన్నికల్లో తమ పార్టీ 95-105 సీట్లు గెలుచుకుంటుందని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు.

brs

brs

Read more RELATED
Recommended to you

Latest news