మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ పార్టీ మోడ్‌లో ఉంది. తన మనవరాలు పుట్టిన తర్వాత తొలి బర్త్ డే కావడంతో చిరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా చిరుకు ఓ స్పెషల్ పర్సన్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆ పర్సన్ ఎవరో కాదు ఆయన మనవరాలు క్లీంకార. అదేంటి.. అంత చిన్న పాప ఎలా విష్ చేస్తుంది అనుకుంటున్నారా..? తన కుమార్తె.. తన తండ్రికి బర్త్ డే విష్ చేస్తున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పోస్టు చేశారు. ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే టూ అవర్ డియరెస్ట్ ‘చిరు’త(చిరు తాత). మా, అలాగే కొణిదెల ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన కొత్త మెంబర్ నుంచి మీకు బోలెడంత లవ్’ అంటూ ఆ ఫొటో కింద క్యాఫ్షన్ రాసుకొచ్చారు. ఆ ఫొటోలో పాప ఫేస్‌ను కవర్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
Happiest Birthday to our dearest
CHIRUTHA – (Chiranjeevi Thatha)
Loads of love from us & the Littlest member of the KONIDELA family. 😍@KChiruTweets pic.twitter.com/NggfdJVpEw— Ram Charan (@AlwaysRamCharan) August 22, 2023