కేసీఆర్ నిర్ణయంతో మాకు నష్టం లేదు.. తమ్మినేని వీరభద్రం

-

బీఆర్ఎస్ తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతం దూషించబోమని విధానపరంగా వ్యతిరేకిస్తామని సీపీఎం, సీపీఐ నేతలు ప్రకటించారు. హైదరాబాద్ లో ఈ రెండు పార్టీల నేతలు సమావేశమై ఇరు పార్టీల నేతలు చర్చించారు. అనంతరం తమ్మినేని వీర భద్రం మీడియాతో మాట్లాడుతూ..  నీ ఖర్మ కి మేమేం చేయలేము అని.. అధికారం కాపాడుకోవడం కోసం బీజేపీ తో మైత్రి కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్.. ఏకపక్షంగా జాబితా ఇచ్చారు. మేము అడిగిన సీట్ల లో కూడా అభ్యర్థుల జాబితా ఇచ్చారు. మేము ఇది ఊహించని పరిణామం అన్నారు. మునుగోడు లో ఆయనే  మద్దతు అడిగారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తాం అని చెప్పారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారు. వామపక్షాలు లేకపోతే  మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది. రాష్ట్రంలోవామపక్ష పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news