జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్.. వీడియో చూశారా

-

జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్‌-3 చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్రో పంపిన చంద్రయాన్‌-3లో ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌ తన పరిశోధన షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇస్రో ఓ వీడియోను విడుదల చేసింది. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డు అయిన వీడియోను షేర్‌ చేసింది.

చంద్రుడిపై ల్యాండర్‌ దిగడానికి కొన్ని కి.మీల ముందు మొదలైన ఈ వీడియో.. చంద్రుడిపై అడుగుపెట్టేవరకు రికార్డయింది. ఇప్పటివరకు ల్యాండర్‌ ‘విక్రమ్‌’ తీసిన కొన్ని ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. ‘‘అడుగుపెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ కెమెరా జాబిల్లి చిత్రాన్ని ఎలా క్యాప్చర్‌ చేసిందో చూడండి’’ అంటూ 2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న వీడియోను తాజాగా షేర్‌ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియా గర్వపడాల్సిన క్షణాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ వీడియో షేర్ చేస్తూ ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news