బగ్దాది వీడియోని బయటపెట్టిన అమెరికా లాడెన్ వీడియో ఎందుకు పెట్టలేదు…? అంటే చంపలేదా…?

-

అది 2007… అల్ జజీరాతో పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో ఇంటర్వ్యు. పాకిస్తాన్ లో ముషారఫ్ పాలనపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ ఆ ఇంటర్వ్యు సాగుతుంది. ఇదే సమయంలో ఆమె ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. తనను ఒమర్ షేక్ అనే వ్యక్తి చంపాలి అనుకుంటున్నారు అని… అతను ఎవరో కాదు… గ్రూపు గొడవల్లో ఒసామా బిన్ లాడెన్ ని చంపిన వ్యక్తని… తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె వివరించింది. అప్పుడు అది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు… సరిగా రెండు నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆమెను హత్య చేసారు.

అది 2011 అమెరికా అధికారిక నివాస౦… ప్రపంచానికి ఒక సంచలన విషయాన్ని చెప్పారు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో ఒసామా బిన్ లాడెన్ ని హతమార్చామని అతని శవాన్ని సముద్రంలో పడేసామని చెప్పారు. కాని దానికి సంబంధించిన ఒక్క ఆధారాన్ని కూడా అమెరికా చూపించలేదు. తాజాగా అమెరికా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదిని హతమార్చింది. దానికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఇరాకీ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ని చంపిన వీడియోని అమెరికా యుట్యూబ్ లో పెట్టింది సంతోష పడంది. మరి లాడెన్ వీడియోని ఎందుకు పెట్టలేదు…?

తనను ముప్ప తిప్పలు పెట్టిన వారిని చంపే వరకు నిద్రపోని అమెరికా, వాళ్ళను చంపిన తర్వాత ప్రపంచానికి చూపించి రాక్షసానందం పొందే అమెరికా అప్పుడు తమను వేధించిన లాడెన్ వీడియోని ఎందుకు పెట్టలేదు…? అదీ ప్రపంచ ఉగ్రవాదులకు బాస్ అయిన వ్యక్తి వీడియో… కేవల౦ ఒకే ఒక్క అమెరికా సెనేటర్ కి మాత్రమె అసంతృప్తిగా సాక్ష్యాలను చూపించిన అమెరికా… లాడెన్ కి సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేదు. అంటే బెనజీర్ బుట్టో చెప్పిందే నిజమా…? అబూబకర్ వీడియో విడుదల చేసిన తర్వాత జనాలకు ఇదే అనుమానం కలుగుతుంది. లాడెన్ ని అమెరికా చంపలేదని, చంపి ఉంటే సాక్ష్యాలను బయటపెట్టి ఉండేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news