కేసీఆర్ వ్యూహంతో బీజేపీ, కాంగ్రెస్ డిఫెన్స్‌లో ప‌డ్డాయ్‌గా…

-

రాజకీయ వ్యూహ రచనలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైలే వేరు.. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆయన తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రత్యర్థులను ఎప్పుడు, ఎలా దెబ్బకొట్టాలో కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ విషయం అనేక మార్లు రుజువు అయింది కూడా. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయాలను అందుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలు ఇందుకు నిదర్శనం.

తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలు సాహసోపేత మైనవి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నా.. ఆయన ఒనకడం లేదు బెనకడం లే దు. సుమారు 49 వేల మంది ఆర్టీసీ కార్మికులు 28 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాల‌తోపాటు వివిధ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మె వెనుక రాజకీయ స్వార్థం ఉండడం వల్లే కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలను ఇరుకున పెట్టేందుకు సీఎం కేసీఆర్ భారీ వ్యూహం  రచించారు. ఇందులో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఆయన టార్గెట్ చేయడం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వెహికల్ చట్టం ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నామని,  ఇందులో భాగంగానే ప్రైవేట్ బ‌స్సుల‌కు పర్మిట్లు ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆర్టీసీని ఎలా నాశనం చేశారో ఆయన చెప్పడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ బీజేపీలను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్య‌వ‌హరించారు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news