ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డును రాజకీయ పునరావస కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంసీఏ స్కామ్ లో నిందితుడిగా ఉన్న కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి ని టీటీడీ బోర్డు సభ్యునిగా చేర్చడంపై ఆమె మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా తీసుకునే నిర్ణయాలను సహించబోమని హెచ్చరించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం లో శరత్ చంద్రారెడ్డి పాత్రధారిగా ఉన్నారని, ఎంసీఏ స్కాం లో దోషిగా తేలి కేతన్ దేశాయ్ పదవి కోల్పోయారని విమర్శించారు. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే విధానాన్ని బిజెపి ఖండిస్తుందని అన్నారు. అలాగే బిజెపి అధికార ప్రతినిధి లంక దినకరన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కి తిరుమల శ్రీవారి సేవ కన్నా.. తన సొంత వారి సేవ ప్రాధాన్యం అయ్యిందని దుయ్యబట్టారు.