‘మేకిన్ ఇండియా’ ఇప్పుడు చంద్రుడి వరకు సాగిందని.. మంగళ్యాన్, చంద్రయాన్ విజయం స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ విజయాల స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదామని అన్నారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.
దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన మోదీ ఇవాళ బెంళూరులోని ఇస్రోను సందర్శించారు. చంద్రయాన్-3ని విజయవంతంగా జాబిల్లిపైకి పంపించిన శాస్త్రవేత్తలందర్ని అభినందించారు. వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానంతో ఎన్నో ఫలితాలు అందుకోవాలని అన్నారు.
‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రయాన్ – 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్ – 3 విజయంపైనే ఉంది. విజయం పట్ల శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధారణ విజయం. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్ – 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.