నా జీవితంలో మొదటిసారి అలా అడగాల్సి వచ్చింది – కంగనా రనౌత్

-

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను భారీగా అలరించే ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు గురి అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2.. దర్శకుడు పి వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో కంగనా చంద్రముఖిగా నటిస్తోంది. నటుడు వడివేలు ముఖ్యపాత్ర పోషించగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ.. తనను మళ్లీ తమిళ్ చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చిన లైకా ప్రొడక్షన్స్ వారికి , దర్శకుడు పి వాసుకి కృతజ్ఞతలు అంటూ తెలిపారు. ఇక కంగనా రనౌత్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఎలాంటి అవకాశాన్ని కోరలేదని అలాంటిది దర్శకుడు పీ వాసు వద్ద చంద్రముఖిగా నటించడానికి తాను నప్పుతానా అని అడిగానని ఆమె తెలిపారు.

అయితే డైరెక్టర్ కొంచెం సేపు ఆలోచించి కరెక్ట్ గా సెట్ అవుతావని అన్నారని కంగనా రనౌత్ వెల్లడించింది. నా జీవితంలో మొదటిసారి ఒక క్యారెక్టర్ గురించి నేను అలా అడగాల్సి వచ్చింది అంటూ తెలిసింది. మొత్తానికి అయితే కంగనా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి తన నటనతో కంగనా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news