అల్లు అర్జున్ నేటి తరం నటుడిగా స్వశక్తితో ఎదిగాడు – సీఎం కేసీఆర్

-

తెలుగు సినిమా పరిశ్రమలో జాతీయ అవార్డును దక్కించుకున్న మొదటి నటుడిగా అల్లు అర్జున్ ఘనతను సాధించాడు. 2021 లో విడుదలైన పుష్ప మూవీ లో అల్లు అర్జున్ నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే…దీనిపై సీఎం కేసీఆర్‌ ప్రసంశల జల్లు కురిపించారు. అల్లు అర్జున్ నేటి తరం నటుడిగా స్వశక్తితో ఎదిగాడని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన రీతిలో తమ అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్…69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news