ఏపీ విద్యార్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. విద్యా దీవెన నిధులను ఈనెల 28వ తేదీన అంటే రేపు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే రేపు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి కి చేరుకుంటారు సీఎం జగన్. విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థుల ఫీజుల మొత్తాన్ని విడదల వారీగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు.