ఆగస్టు 29 వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం మన్ కి బాత్ 104వ ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగు కూడా సంస్కృతంలో పురాతనమైన భారతీయ భాషేనని తెలిపారు. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలతో బంధం ఏర్పడుతుందన్నారు.
దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు ఒకటని అన్నారు. తెలుగు సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని అద్భుతాలు ఉన్నాయన్నారు. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు మోదీ. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.