పాకిస్తాన్ క్రికెట్ టీం నెం. 1 వన్డే జట్టుగా అవతరించింది. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడంతో వన్డేల్లో నెం. 1 స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఆసియా కప్, వరల్డ్ కప్ కి ముందు నెం. 1టీం గా నిలవడం…పాక్ టీమ్ కు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, టీమిండియా మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్ ఇటీవల తన వన్డే WC జట్టును ప్రకటించారు. దీంతో ఇందులో మీ 3D ప్లేయర్ ఎవరు? మీ 3D ప్లేయర్ విజయ్ శంకర్ ఎక్కడికి వెళ్లాడు? అంటూ పలువురు నెటిజెన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. 2019 వన్డే WCకి అంబటి రాయుడును పక్కనపెట్టి, 3D ప్లేయర్ అని పేర్కొంటూ విజయ్ శంకర్ ను MSK సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.