తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరూ టికెట్ ఆశించిన దక్కని వారు అధికార పార్టీ నుంచి ప్రతి పక్ష పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి BRS నాయకులు బండి రమేష్ అసంతృప్తి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు నాకు టికెట్ ఇస్తానని మాట ఇచ్చినందుకు తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డానన్నారు.
చివరికీ చాలా చేస్తారని.. ఊహించలేదన్నారు. తాను కేసీఆర్, కేటీఆర్ ని కలిసిన తరువాతనే పార్టీలో ఉండాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు బండి రమేష్. గతంలో కూడా 30వేల పైచిలుకు ఓట్లు వేసిన శేరిలింగంపల్లి ప్రజలు తామంతా మీతో ఉన్నామని చెప్పారు. తనకు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇన్ చార్జీగా ఇచ్చినప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయవంతం చేశానని తెలిపారు. ఆ విషయం తాను గర్వంగా చెప్పుకుంటానన్నారు. ఎందుకు అంటే ఈ విషయం కేసీఆర్ కి తెలుసు అన్నారు.
ఇక ఆ తరువాత బోడుప్పల్ కార్పొరేషన్ లో ప్రధాన పాత్ర పోషించి అక్కడ బోడుప్పల్ కార్పొరేటర్ మేయర్ గా టీఆర్ఎస్ పార్టీ నేతను ఉంచి తాను చాలా కష్టపడ్డానన్నారు. మునుగోడు ఎన్నికల్లో కూడా ప్రధానమైన పాత్ర పోషించి అక్కడ గెలుపు కైవసం చేసుకోవడానికి తాను ఎంతో ప్రధానమైన వ్యక్తిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాను పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నాను అని.. పార్టీ కోసం ప్రధాన వ్యక్తిగా ఉండి గెలుపుని బీఆర్ఎస్ కోసం అదిస్తూనే ఉన్నానని చెప్పారు.