ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఆర్థిక బాధలే వుండవు..!
హనుమంతుడిని పూజించేటప్పుడు చాలా మంది తమలపాకులని వేస్తూ ఉంటారు తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో కచ్చితంగా పూజ చేస్తారు. పూల కంటే ఆకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి హనుమంతుడిని పూజించడం జరుగుతుంది. హనుమంతుడు ని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి.
హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనే విషయాలని ఇప్పుడు చూద్దాం… హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన ఆర్థిక బాధలు ఏమీ ఉండవు. గండాలు వంటివి కూడా ఈజీగా తొలగిపోతాయి. హనుమంతుడు ఆకు పూజ ని ఎంతో ఇష్టపడతారు హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మవారిని కలుసుకున్న తర్వాత రాముడికి వచ్చి సీత క్షేమం గురించి చెబుతారు.
అప్పుడు సంతోషంగా రాముడు తమలపాకుని తెంపి మాలగా ఆంజనేయ స్వామి మెడలో వేస్తారు. ఆంజనేయస్వామి తోక తో లంకా నగరాన్ని తగలబెట్టి వచ్చినప్పుడు చల్లగా తమలపాకు ఉంచుతుంది హనుమంతుని మెడలో రాములవారు తమలపాకు మాలిని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతారు. అయితే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇచ్చేస్తారని.. కోరుకునేవి జరుగుతాయని పండితులు అంటున్నారు కాబట్టి ఆంజనేయస్వామిని ఇలా కొలుస్తారు. అందుకే పూల తో కంటే కూడా ఆకుల వలన ఆంజనేయ స్వామి కి ఆనందం కలిగి మనకి వరాలు ఇస్తారు.