‘G20 సమావేశాలకు రాలేకపోతున్నా’.. ప్రధానికి పుతిన్​ ఫోన్​

-

ఈ ఏడాది జీ-20 బృందానికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది భారత్. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశముందంటూ మొన్నటిదాకా వార్తలొచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెలలో దిల్లీలో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సుకు తాను హాజరు కాలేనంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తెలిపారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భారత్‌కు వస్తారని తెలిపారు.  ఈ మేరకు మోదీతో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇద్దరు నాయకులు భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఫోన్‌లో సమీక్షించినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సుకు కూడా పుతిన్‌ హాజరు కాలేదు. ఆయన తరఫున సెర్గీ లవ్రోవ్‌ పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆయన విదేశాలకు వెళితే అరెస్టయ్యే ముప్పు ఉండటంతో.. జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news