వారంలో 2 రోజులు ఇళ్లు ఊడ్చి, క్లీన్‌ చేస్తూ నెలకు రూ. 82 లక్షలు సంపాదిస్తున్న పనిమనిషి

-

ఈరోజుల్లో మహిళలు ఆఫీస్‌ పని, ఇంటి పని రెండింటిని మేనేజ్‌ చేయలేకపోతున్నారు. అసలు ఈ రెండు చేయడం కష్టం. వచ్చే జీతంలో రెండు మూడు వేలు మనవి కావు అనుకుంటే.. ఒక పనిమనిషి వస్తుంది. ఆమె ఇళ్లంతా క్లీన్‌ చేస్తుంది. మనం ప్రశాంతంగా ఆఫీస్‌కు వెళ్లి రావొచ్చు అనుకుంటున్నారు. మీ దగ్గర ఒక పనిమనిషి జీతం ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 2- 5 వేలు. ఇంక సిటీల్లో అయితే పదివేలు ఉంటుంది. కానీ ఒక పనిమనిషి కేవలం ఇళ్లు ఊడ్చి, తడిగుడ్డ వేసి క్లీన్‌ చేసినందుకు నెలకు రూ. 80 లక్షలు తీసుకుంటుంది. ఓడియమ్మ.. ఈ పనే బాగుంది కదా అనుకుంటున్నారా..? ఆమెలో ఉన్న స్పెషాల్టీ ఏంటి..? ఎందుకంత డిమాండ్‌, అసలు ఈ పనిమనిషి ఎక్కడుందో తెలుసుకుందామా.।!

అమెరికాలోని మసాచుసెట్స్‌లో నివసించే 23 ఏళ్ల అంబర్ పేజ్(Amber page) ప్రపంచంలోనే అత్యధికంగా కోరుకునే పనిమనిషి. అంబర్ పేజ్.. నెలలో ఎనిమిది రోజులు మాత్రమే పనికి వస్తుందట. అంటే వారానికి రెండు రోజులు ప్రజల ఇళ్లు ఊడ్చేందుకు వెళుతుంది. మిగిలిన రోజుల్లో ఫుల్‌టైమ్ నర్సుగా పనిచేస్తోంది. అయితే వారంలో రెండు రోజులు మాత్రమే పనిమనిషిగా చేస్తూ నెలకు రూ.82 లక్షలు సంపాదిస్తుంది. అంబర్‌కు పని చేయడానికి ప్రత్యేక నియమం ఉంది, దీని కారణంగా ప్రజలు ఆమెకు ఇంత ఎక్కువ జీతం చెల్లిస్తున్నారు.

అంబర్.. ప్రజల ఇళ్లలో పనికి వెళ్లినప్పుడు ఆమె బట్టలు విప్పుతుంది. అంటే ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆమె బట్టలు విప్పేసి పనిచేస్తుంది. కేవలం ఇన్నర్స్‌ మాత్రమే వేసుకుని పని చేస్తుందట. అందుకే అంత డిమాండ్‌. వారంలో రెండు రోజులు మాత్రమే పనిచేస్తూ రూ.82 లక్షలు సంపాదిస్తుంది. హైలెట్‌ ఏంటంటే.. ఈ పనిలో అంబర్ ప్రియుడు ఆమెకు ఫుల్ సపోర్ట్ ఉంటాడట

ఇలా ఎందుకు..?

కోవిడ్‌కు ముందు తను తన స్వంత క్లీనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించనట్లు అంబర్‌ తెలిపింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా కారణంగా తన వ్యాపారం ఆగిపోయింది. అటువంటి పరిస్థితిలో, ఆమె తన వ్యాపారాన్ని తిరిగి స్థాపించడానికి టాప్‌లెస్ పనిమనిషిగా మారాలని నిర్ణయించుకుంది. తాను బట్టలు లేకుండా శుభ్రం చేసినప్పుడు, ప్రజలు తన వైపు చూస్తూ ఉంటారని చెప్పింది. ఇందులో తనకి ఎలాంటి నష్టం, తప్పు కనిపించడం లేదని అంబర్ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news