ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. ‘చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ పేరుతో చెల్లని నాణెం తీసుకురావడం బాధాకరం. సోషల్ మీడియాలో చెల్లని నాణెం అని ఎగతాళి చేస్తుంటే… కన్నీళ్లు వస్తున్నాయి. ఇదేనా ఎన్టీఆర్ కు చేసే ఉపకారం? వ్యాపార కోణంలో ఎన్టీఆర్ ను ఇలా వాడుకోవడం చాలా దారుణం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అటు ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తున్నారు అని పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి సీరియస్ అయ్యారు. చిన్నమ్మా పురందేశ్వరి! ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఏంటమ్మా? భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఆయన ఆత్మను క్షోభకు గురిచేసారే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణెం కొనుగోలు ధర రూ.4,160. నాణెం తయారీకి 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ వంటి విలువైన లోహాల సమ్మేళనం అన్నారు.