దేశంలో రానున్న ఎన్నికలలో ఎలాగైనా అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలోని బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ సారధ్యంలోని I.N.D.I.A కూటమి చాలా చురుకుగా పనిచేస్తోంది. మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి అథఃపాతాళానికి పడిపోయిందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు వీరి పాలనకు శుభం పలకాలని కూటమి కోరుకుంటోంది. ఈ సంవత్సరంలోనే అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీజేపీని ఓడించడానికి ఇదే మొదటి అడుగుగా ఈ కూటములు పనిచేయనున్నాయి. అందులో భాగంగా రేపు ముంబై లో INDIA కూటమి సమావేశం అవనుంది. ఈ కూటమి లోగో ఎంపిక, కన్వీనర్ లేదా చైర్ పర్సన్ ను కూడా ఈ సమావేశంలో నిర్ణయించి ప్రకటించనున్నారు. ఇంకా ఈ ఎన్నికలలో కూటమిలో భాగం అయిన పార్టీలకు సీట్ల కేటాయింపు కూడా ముఖ్యమైన అంశం అని చెప్పాలి.. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
రేపు మరియు ఎల్లుండి రెండు రోజులు జరగనున్న ఈ కూటమి మీటింగ్ లో దేశం మొత్తం మీద 26 పార్టీల నుండి 62 మంది ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తున్నారు.