గన్ లైసెన్స్ కావాలని అనకాపల్లి ఎస్పీకి దరఖాస్తు చేసుకున్న సామాన్యుడు..!

-

గన్ లైసెన్సు కావాలని అనకాపల్లి జిల్లా ఎస్పీని వేడుకున్నాడు ఓ సామాన్య వ్యక్తి. తనను పైళ్ల శ్రీనివాస్, అతని అనుచరులు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మొరపెట్టుకున్నాడు. ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్స్  కోసం దరఖాస్తూ పెట్టుకున్నాడు ఆర్.ఆర్.ర్ నాయుడు అనే పరవాడకు చెందిన వ్యక్తి.

ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ప్రశ్నించాడని ఆర్. ఆర్. నాయుడు అనే వ్యక్తికి సదరు నేత నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ  బెదిరింపులు మాత్రం ఆగకపోవడంతో అధికారులను కలిసిన ఆర్.ఆర్.నాయుడు తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరాడు బాధితుడు. తనను చంపాలని చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news