మా అన్నకు రాఖీ కట్టాలి.. వెతికి పెట్టండి సార్..! పోలీసులను ఆశ్రయించిన యువతి

-

అంతులేని అనురాగానికి నిదర్శనం అన్నాచెల్లెళ్ల బంధం. అనుబంధం, ఆత్మీ యతకు ప్రతిరూపం రక్షాబంధన్. ప్రతి యేటా రాఖీ పౌర్ణమి రోజు అన్నాచె ల్లెలు రాఖీ కట్టుకోవడం సంప్రదా యంగా వస్తుంది. అయితే కార్మిక నగ ర్కు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు మృతిచెందగా.. అన్న, చెల్లెలు వేర్వే రుగా హాస్టళ్లలో ఉంటూ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నారు.

కాగా రాఖీ పండుగకు వారం ముందు నుంచి ప్రవీణ్ కు మార్ ఆచూకీ తెలియడం లేదు. తాను ఈ రోజు ఎలాగైనా రాఖీ కట్టాలని ఆ యువతి అన్వేషిస్తున్నది. అన్నను వెతికిపెట్టాలని ఆ చెల్లెలు మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆయువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. తన దొరికితే రాఖీ కట్టీ అన్నచెల్లెల్లు సంతోషంగా ఉంటారు. అన్నచెల్లెల్ల సంతోషం వెలకట్టలేనిదనే చెప్పవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news